జపాన్లో మూడు రోజుల థ్యాంక్స్ గివింగ్ సెలవలతో కరోనా కేసులు సంఖ్య అమాంతం పెరిగిపోయింది. పెద్ద ఎత్తున ప్రజలు ప్రయాణాలు చేయడం, రెస్టారెంట్లకు పోటెత్తడం వల్ల ఒక్కరోజులోనే గరిష్ఠ స్థాయిలో కేసులు వెలుగు చూశాయి. కొత్తగా 2,508 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో మొత్తం 1,963 మంది మరణించారు.
ఇతర దేశాల్లో...
- ఆస్ట్రేలియాలో వేసవి కావడం కారణంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. దేశంలో పలు చోట్ల ఆంక్షలను తొలగించారు. కానీ మాస్క్ లేకుండా బయట తిరగడం నిషేధించారు.
- వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తున్నందున బ్రిటన్లో విధించిన లాక్డౌన్ను సడలించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ప్రధాని బోరిస్ జాన్సన్ డిసెంబర్ 2 నుంచి లాక్డౌన్ ఎత్తివేసేందుకు అనుమతినిచ్చారు. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచాలని ఆదేశించారు.
- మెక్సికోలో తాజాగా 550 మంది కరోనాతో చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,01,373 కు చేరింది.
- పాకిస్థాన్లో మరో 2,665 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 59 మంది మరణించారు. మొత్తం మూడు లక్షల 29 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- దక్షిణ కొరియాలో మరో 330 మంది వైరస్ బారిన పడ్డారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 30,733 చేరింది. 505 మంది మరణించారు.