తెలంగాణ

telangana

ETV Bharat / international

విహారి: ప్రకృతితో ప్రయాణం ఇలా ఉంటుంది!

కాంబోడియాలోని అంగ్​కోర్​వాట్​ దేవాలయం పర్యటక ప్రాంతంగా ప్రసిద్ధి గాంచింది. ఈ ఆలయానికి వెళ్లే పర్యటకులు భిన్నంగా తమ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఒకరు బైక్​రైడ్​తో స్థానికులను కలవాలని, మరొకరు కాలుష్యాన్ని నియంత్రించే విధంగా స్ఫూర్తినివ్వాలని!

పర్యావరణ పరిరక్షణలో అంగ్​కోర్​ పర్యటకులు

By

Published : Jul 15, 2019, 12:59 PM IST

పర్యావరణ పరిరక్షణలో అంగ్​కోర్​ పర్యటకులు

అంగ్​కోర్​​వాట్ దేవాలయం ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన పర్యటక ప్రాంతాల్లో ఒకటి. కాంబోడియాలోని సీమ్‌ రీప్‌ పట్టణానికి సమీపంలో ఉన్న ఆలయంలో హిందూ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుత శిల్పకళా నైపుణ్యం పర్యటకులను ఆకట్టుకుంటుంది.

కొంతమంది పర్యటకులు ఈ ప్రాంతానికి వెళ్లేందుకు కాస్త విభిన్న పద్దతులను ఎంచుకున్నారు. కొందరు మోటార్​ బైకులు రైడ్​ చేస్తూ, స్థానికులతో మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల్లో పర్యటక రంగం వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాల గురించి తెలియజేస్తుంటారు.

బైక్​పై ప్రయాణించడం వల్ల చుట్టూ ఉన్న జనాలతో మాట్లాడొచ్చు. నేను మిగతా పర్యటకుల్లా చేయాలనుకోవట్లేదు. బస్సులో ప్రయాణిస్తే నాకు నచ్చిన చోట నేను దిగలేను. అందుకే నేను బైక్​ రైడ్​ను ఎంచుకున్నాను.

-బెక్కా షాడోన్​,అమెరికా టూరిస్టు

కాలుష్యరహితంగా ప్రయాణం:

పర్యావరణాన్ని రక్షించడానికి ఇంకొకరు ఇక్కడ ఎలక్ట్రిక్​ కారులో ప్రయాణిస్తున్నారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి ఈ విధంగా ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్తున్నట్లు బొలెరో బ్లూ సొల్యూషన్స్​ మేనేజర్​ హాంగ్​ సెంగ్​ మెంగ్​ తెలిపారు.

ఆలయ సమీపంలోని రెస్టారెంట్లలో ఒకటి ట్రీలైన్​ అర్బన్​ రిసార్ట్​. ఎటువంటి ప్లాస్టిక్​ వినియోగించకుండా వచ్చే అతిథులకు షేవింగ్​ కిట్​ మొదలు స్ట్రా వరకు అన్నీ కొయ్యతో చేసినవి అందిస్తారు. వారికి వచ్చే లాభాలను ఎగ్​బోక్​ కలినరీ స్కూల్​కు విరాళంగా ఇస్తున్నారు. వాటి సాయంతో యువకులు ఆతిథ్య రంగంలో నైపుణ్యాలు పెంపొందించుకునే వీలు కల్పించామని రెస్టారెంట్​ నిర్వహకుడు, పెంగ్​ సోఖీన్​ వివరించారు.

దీర్ఘకాలిక ప్లాస్టిక్​ కాలుష్యంతో ప్రభావితమైన కాంబోడియాను ప్లాస్టిక్​ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర పోషించింది జయా హౌస్​ రివర్​ పార్కు. వచ్చే అతిథులకు స్కానింగ్ చేయగల క్యూఆర్​ కోడ్​తో కూడిన వాటర్​ బాటిల్స్ ఇస్తారు. నీరు కావాల్సినప్పుడు ఈ కోడ్​ స్కాన్​ చేసి దగ్గరలోని నీరు లభించే ప్రదేశాన్ని తెలుపుతుంది.

ఇదీ చూడండి:రూ.200 కోసం కెన్యా నుంచి భారత్​కు..!

ABOUT THE AUTHOR

...view details