Blast in china office: చైనాలోని ఓ ప్రభుత్వ కార్యాలయ కెఫ్టెరియాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
చాంకింగ్ నగరంలో శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటల ప్రాంతంలో (స్థానిక కాలమానం ప్రకారం) ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు.. సహాయక చర్యలు చేపట్టారు. కెఫ్టెరియా శిథిలాలు తొలగించి మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.