కరోనా కారణంగా మూసివేసిన అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆరు నెలల సుదీర్ఘ కాలం తర్వాత తిరిగి ప్రారంభిస్తున్నట్లు చైనా తెలిపింది. ఆ దేశ రాజధాని బీజింగ్ నుంచి మిత్రదేశమైన పాక్‌తో సహా ఎనిమిది దేశాలకు విమానాలను గురువారం నుంచి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది.
బీజింగ్ నుంచి మొదటి ఎయిర్ చైనా విమానం కాంబోడియా రాజధానికి బయలుదేరనున్నట్లు వెల్లడించారు ఆ దేశ అధికారులు. ఆసియాలో థాయ్‌లాండ్, కంబోడియా, పాకిస్థాన్‌కు.. అలాగే ఐరోపాలోని గ్రీస్, డెన్మార్క్, ఆస్ట్రియా, స్వీడన్లకు సర్వీసులను పునరుద్ధరించనున్నారు. ఉత్తర అమెరికాలో కెనడాతో పాటు తక్కువ సంఖ్యలో కరోనా కేసులు ఉన్న దేశాలకు సర్వీసులు తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొంది.