తెలంగాణ

telangana

ETV Bharat / international

బాలాకోట్​లో అంతర్జాతీయ మీడియా పర్యటన - balakot

పాకిస్థాన్​లోని బాలాకోట్​ను అంతర్జాతీయ మీడియా, విదేశీ ప్రతినిధుల బృందం సందర్శించింది. భారత వాయుసేన అక్కడ  మెరుపుదాడులు నిర్వహించిన 43 రోజుల తర్వాత ఈ పర్యటనకు పాక్ అనుమతివ్వటం గమనార్హం. ప్రతినిధులను బాలాకోట్​కు వెంట తీసుకెళ్లిన పాకిస్థాన్​ సైన్యం... ఎలాంటి నష్టం జరగలేదని నిరూపించే ప్రయత్నం చేసింది.

బాలాకోట్​లో అంతర్జాతీయ మీడియా పర్యటన

By

Published : Apr 11, 2019, 8:17 PM IST

బాలాకోట్​ను సందర్శించేందుకు విదేశీ ప్రతినిధులను, అంతర్జాతీయ మీడియా సంస్థలను ఆహ్వానించింది పాకిస్థాన్​ సైన్యం. అక్కడి ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మెరుపుదాడులు నిర్వహించిన 43రోజలు తర్వాత మొదటిసారి ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు విదేశీ ప్రతినిధులను అనుమతించింది పాక్. ఇస్లామాబాద్​ నుంచి బాలాకోట్​లోని జబ్బా వరకు హెలికాప్టర్​లో వీరంతా వెళ్లినట్లు సమాచారం.

బాలాకోట్​లో భారత వాయుసేన దాడులు చేయలేదని చెప్పేందుకు పాకిస్థాన్​ ప్రయత్నించింది. దాడులు జరిగిన 43 రోజుల తర్వాత ఘటనా స్థలంలోకి అనుమతిచ్చి మరోసారి కపటత్వాన్ని చాటిచెప్పుకుంది.

మీడియా ప్రతినిధుల సందర్శన సమయంలో బాలాకోట్​లోని మదర్సాలో దాదాపు 150 మంది విద్యార్థులకు ఖురాన్​ను బోధిస్తున్నారు.

"అక్కడ మదర్సా చాలా ఏళ్లుగా అలానే ఉంది. భారత వాయుసేన దాడుల్లో ఎలాంటి నష్టం జరగలేదు."
-ప్రతినిధులతో పాక్ సైనికాధికారి అసిఫ్ గఫూర్​

ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఘటనకు ప్రతీకారంగా భారత వాయుసేన పాకిస్థాన్​ బాలకోట్​లోని జైషే మహ్మద్​ ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు నిర్వహించింది.

ఘటనలో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారని భారత్ పేర్కొంది.

భారత్​ వాదనను పాక్ అంగీకరించలేదు. తమకు ఎలాంటి నష్టం జరగలేదని ప్రకటించింది. అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదీ చూడండి:వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజే అరెస్టు

ABOUT THE AUTHOR

...view details