తెలంగాణ

telangana

ETV Bharat / international

హడావిడిలో బిడ్డనే మరిచిన తల్లి! - return

సౌదీఅరేబియా జెడ్డా విమానాశ్రయంలో ఓ మహిళ తన బిడ్డను మర్చిపోయి విమానం ఎక్కింది. తీరా పిల్లాడిని వదిలేశానని తెలుసుకుని విమాన సిబ్బందిని ప్రాధేయపండి. చేసేది లేక పైలెట్​ విమానాన్ని వెనక్కి మళ్లించాడు.

ఎయిర్​పోర్ట్

By

Published : Mar 13, 2019, 6:01 AM IST

Updated : Mar 13, 2019, 7:12 AM IST

ప్రయాణంలో ఏదోకటి మర్చి పోవడం సాధారణంగా జరుగుతునే ఉంటుంది. హడావిడిలో పర్సో, బ్యాగో మర్చిపోతుంటారు ప్రయాణికులు. కానీ ఓ మహిళ బిడ్డనే మర్చిపోయింది. సౌదీఅరేబియలోని జెడా అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనలో ఏకంగా విమానమే తిరిగి వెనక్కొచ్చింది.

పైలట్.. ఎయిర్​పోర్టు సిబ్బందితో రేడియోలో మాట్లాడుతున్న వీడియో వైరల్ అవుతోంది. సౌదీ అరేబియా జెడ్డాలోని అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ ఎయిర్​పోర్టు వెయిటింగ్​రూమ్​లో బిడ్డను వదిలిపెట్టి విమానమెక్కింది. తీరా శిశువు లేదని తెలుసుకుని పైలట్​కి ఫిర్యాదు చేసింది. ఆమె కోరిక మేరకు పైలట్​ విమానాశ్రయాధికారులతో అనుమతి కోరుతూ మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కోడుతోంది.

పైలట్​ ఈ విధంగా మాట్లాడారు..“ఓ ప్రయాణికురాలు తన బిడ్డను టెర్మినల్​లో వదిలిపెట్టింది. ఫ్లైట్​ ని వెనక్కి తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వండి" ఈ మాటలకు స్పందించిన ఆపరేటర్ “సరే వెంటనే వెనక్కి రండి.. ఇలా జరగడం ఇదే తొలిసారి” అని అంటూ బదులిచ్చాడు

Last Updated : Mar 13, 2019, 7:12 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details