తెలంగాణ

telangana

By

Published : Mar 21, 2021, 1:07 PM IST

ETV Bharat / international

ఆస్ట్రేలియాలో వరదలు- నీట మునిగిన సిడ్నీ!

ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్​వేల్స్​లో వరదలు సంభవించాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పశ్చిమ సిడ్నీలోని పలు ప్రాంతాల్లో 300 మిల్లీ మీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం కురిసింది.

AUS-FLODDS
ఆస్ట్రేలియాలో వరదలు- నీట మునిగిన సిడ్నీ!

ఆస్ట్రేలియాలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన న్యూ సౌత్​వేల్స్​లో భారీ వరదలు సంభవించాయి. దశాబ్దంలో ఎన్నడూ చూడని రీతిలో వరదలు ప్రభావం చూపించాయి. సిడ్నీకి పశ్చిమాన ఉన్న వర్రగంబ డ్యాం పొంగిపొర్లుతోంది. నగరంలోని పలు దుకాణాలు, లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి.

నీట మునిగిన భవనాలు, దుకాణ సముదాయాలు
వరద ఉద్ధృతి

లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు 13 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరిన్ని శిబిరాలను సిద్ధం చేస్తున్నారు. మరో మూడు-నాలుగు రోజులు వాతావరణం ఇలాగే ఉండనున్నట్లు అధికారులు వెల్లడించారు.

రోడ్లు, పరిసరాలు జలమయం

వందేళ్ల విపత్తు

వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని కాపాడినట్లు రాష్ట్ర ప్రధాని గ్లాడీస్ బెరెజిక్లియాన్ తెలిపారు. రాష్ట్ర అత్యవసర సేవల బృందాలు 640 ఫోన్​కాల్స్​ను స్వీకరించాయని, వరదల్లో చిక్కుకున్నవారి నుంచి 66 కాల్స్ వచ్చాయని చెప్పారు. ఉత్తర తీరం సహా పలు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత కేంద్రాలకు పంపిస్తున్నట్లు వివరించారు. ఈ ఘటనను వందేళ్లకు ఓసారి సంభవించే విపత్తుగా అభివర్ణించారు. అయితే, పరిస్థితులు ప్రమాదకరంగా లేవని చెప్పారు.

రహదారి పై నుంచి ఉప్పొంగుతున్న కాలువ
భారీగా వరద ప్రవాహం

వరద ప్రభావ ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు కురుస్తున్నట్లు వెల్లడించారు గ్లాడీస్. పశ్చిమ సిడ్నీలోని పలు ప్రాంతాల్లో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పారు. గత రికార్డులను ఇవి తుడిచేశాయని తెలిపారు.

నీటిలో మునిగిపోయిన వ్యాను
విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు

ABOUT THE AUTHOR

...view details