తెలంగాణ

telangana

ETV Bharat / international

మోదీతో సెల్ఫీ తర్వాత ఆసీస్ పీఎం హిందీ​ డైలాగ్ - ఆస్ట్రేలియా

భారత ప్రధాని నరేంద్రమోదీపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మారిసన్​ ప్రశంసలు కురిపించారు. "మోదీ ఎంత మంచివారో" అని హిందీలో రాసి ఆయనతో దిగిన సెల్ఫీని ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు.

మోదీతో స్కాట్​ సెల్ఫీ

By

Published : Jun 29, 2019, 11:08 AM IST

Updated : Jun 29, 2019, 11:33 AM IST

జపాన్​లో జరుగుతోన్న జీ-20 సదస్సులో భాగంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మారిసన్​ను భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించిన మారిసన్​.. మోదీతో దిగిన సెల్ఫీతో పాటు ఆయనను ప్రశంసిస్తూ ట్వీట్​ చేశారు.

"మోదీ ఎంత మంచివారో..!' -స్కాట్ మారిసన్, ఆస్ట్రేలియా ప్రధాని

మారిసన్​ ట్వీట్​కు మోదీ స్పందించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని తెలిపారు.

ఇద్దరు నేతలూ వారి దేశాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండో సారి ప్రధానిగా గెలుపొందారు. ఈ విజయాలపై పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

ఇదీ చూడండి: జీ20 సదస్సు: అందరి కళ్లు పుతిన్​ 'మగ్​'పైనే

Last Updated : Jun 29, 2019, 11:33 AM IST

ABOUT THE AUTHOR

...view details