తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆస్ట్రేలియాలో భగ్గుమన్న 'కార్చిచ్చు'

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు విజృంభిస్తోంది. అగ్ని జ్వాలలకు చాలా ఇళ్లు దగ్ధమయ్యాయి. ఎంతో ఆస్తి నష్టం వాటిల్లింది. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అధికారులు తెలిపారు. బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఆస్ట్రేలియాలో బగ్గుమన్న కార్చిచ్చు

By

Published : Sep 7, 2019, 4:41 PM IST

Updated : Sep 29, 2019, 7:00 PM IST

ఆస్ట్రేలియాలో బగ్గుమన్న కార్చిచ్చు

ఆస్ట్రేలియాలో 3 రోజులుగా కార్చిచ్చు చెలరేగుతోంది. ప్రాణ భయంతో వందలాది మంది ప్రజలు బలవంతంగా తమ ప్రాంతాలను ఖాళీ చెయ్యాల్సి వచ్చింది. మంటలు వ్యాపించి చాలా ఇళ్లు బూడిదయ్యాయి.

క్వీన్స్​లాండ్​ రాష్ట్రంలో కార్చిచ్చు ప్రభావంతో ఎంతో ఆస్తి నష్టం వాటిల్లింది. దాదాపు 300 మంది నిరాశ్రయులయ్యారు. స్టాన్​తోర్ప్​, వార్​విక్​ ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు.

భయంకరమైన కార్చిచ్చు అదుపులోకి రావడానికి మరో వారం రోజులు పడుతుందని అధికారులు తెలిపారు. బలమైన గాలులు వీచడం, గాలిలో తేమ శాతం తక్కువగా ఉండటమే దీనికి కారణంగా పేర్కొన్నారు.

ఇదీ చూడండి:బొమ్మకోసం 2 ఊళ్ల గొడవ.. నల్ల రంగుతో దాడులు

Last Updated : Sep 29, 2019, 7:00 PM IST

ABOUT THE AUTHOR

...view details