భారత కీర్తిపతాకను అంతర్జాతీయంగా రెపరెపలాడించింది చంద్రయాన్-2 ప్రయోగం. భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు నింగికెగిరింది జీఎస్ఎల్వీ వాహకనౌక. అదే సమయంలో ఆస్ట్రేలియాలో రాత్రి కావటం వల్ల చంద్రయాన్-2 అక్కడి గగనతలంలో వెలుగులు చిమ్ముతూ ప్రయాణించడం కనిపించింది. గ్రహ శకలం లేదా యూఎఫ్ఓ (గుర్తుతెలియని ఎగిరే వస్తువు) వస్తోందని కొంతమేర ఆందోళన పడ్డారు కంగారూలు. చివరికి తెలుసుకుని ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నారు.
ఈ విషయమై ఆస్ట్రేలియా న్యూస్ ఛానల్‌తో మెకిన్లే షైర్ కౌన్సిలర్ మాట్లాడారు.
"ఆ సమయంలో కారవాన్ పార్క్‌లో 160 మంది వరకూ ఉన్నారు. ఆకాశంలో కాంతివంతమైన వెలుగు కనిపించటం వల్ల అందరూ పైకి చూశారు. మూడు నిమిషాల తర్వాత అది మాయమయింది. అదేమిటో అక్కడున్నవారికి అర్థం కాలేదు. చాలా భిన్నంగా ఉంది."