అఫ్గానిస్థాన్లో భారీ పేలుడు-68 మందికి గాయాలు ఉగ్రదాడితో అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్ ఉలిక్కిపడింది. భారీగా పేలుడు పదార్థాలు నింపిన కారుతో నగరంలోని రద్దీ ప్రదేశానికి వచ్చిన ముష్కరులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 68 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు అనంతరం ప్రభుత్వ భవనాల వద్ద ఉన్న జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా సిబ్బంది ప్రతిఘటించి వారిని మట్టుబెట్టారు.
భారీగా ఎగిసిపడుతోన్న పొగతో సమీప ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భారీ పేలుడుతో దాదాపు రెండు కిలోమీటర్ల వరకు భవనాలు కంపించినట్లు స్థానికులు చెప్పారు.
ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ దాడికి బాధ్యత ప్రకటించుకోలేదు.
ఇదీ చూడండి: లెబనాన్: మంత్రి వాహనశ్రేణిపై తుపాకీ గుళ్ల వర్షం