తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాలో మంచు తుపాను.. వావ్​ అనిపించేలా ప్రకృతి అందాలు

మంచు తుపాను కారణంగా ఉత్తర చైనాలో ఉష్ణోగ్రతలు భారీస్థాయిలో పడిపోయాయి. వీధుల్లో మంచు పేరుకుపోయింది. హిమపాతాన్ని అక్కడి ప్రజలు ఆస్వాదిస్తున్నారు.

china snowfall
చైనాలో మంచుతుపాను.. హాయిహాయిగా

By

Published : Nov 7, 2021, 5:35 PM IST

Updated : Nov 7, 2021, 6:06 PM IST

చైనాలో మంచు తుపాను.. వావ్​ అనిపించేలా ప్రకృతి అందాలు

ఉత్తర్​ చైనాను మంచు దుప్పటి కప్పేసింది. బీజింగ్​, తియాంజిన్​, హోహ్హట్​ ప్రాంతాల్లో​ ఉష్ణోగ్రతలు భారీస్థాయిలో పడిపోయాయి. ఆయా ప్రాంతాల్లో జాతీయ వాతావరణశాఖ ఆరెంజ్​ అలర్ట్​ ప్రకటించింది.

స్నో బాల్​ ఆడుకుంటూ ఆహ్లాదంగా గడుపుతున్న కుటుంబం
మంచులో హాయిహాయిగా

మరోవైపు మంచు కురువడం వల్ల ప్రకృతి అందాలు కళ్లకు కనువిందు చేస్తున్నాయి. ప్రజలు వీధుల్లో ఆహ్లాదంగా గడుపుతున్నారు. హిమపాతాన్ని ఆస్వాదిస్తున్నారు. పిల్లలు మంచులో సరదాగా గడుపుతున్నారు.

బీజింగ్​లో దృశ్యాలు
జింగ్​షన్​ పార్కులో ఇలా

రాజధాని బీజింగ్​ సహా అనేక ప్రాంతాల్లో మంచు కురిసిన నేపథ్యంలో రోడ్లు మూతపడ్డాయి. విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

బీజింగ్​ సమీపంలో చిన్నారుల ఆటలు
ఫేస్​ మాస్కు ధరించి మంచులో ఆడుకుంటున్న చిన్నారి
చలికి తట్టుకోలేక

ఇదీ చూడండి:-చైనాను ముంచెత్తిన మంచువాన- ఉక్కిరిబిక్కిరైన ప్రజలు

Last Updated : Nov 7, 2021, 6:06 PM IST

ABOUT THE AUTHOR

...view details