న్యూజిలాండ్ క్రైస్ట్‌చర్చ్ ప్రాంతంలో నివాసం ఉంటోంది అయా అల్ ఉమారీ. రోజూ అన్న హుస్సేన్‌తో కలిసి అల్లరి చేస్తూ ఆనందంగా గడిపేది. చెల్లి ఏ దుస్తులు ధరించినా బాగుంది అని అల్లరిపెట్టేవాడు హుస్సేన్. గత గురువారం బయటికి వెళ్తూ అయా ధరించిన టీషర్ట్‌పై అక్షరాల్ని సరదాగా పలికాడు అవే" సీ యూ బై." ఆ సందర్భంలో అవి అల్లరి మాటలే అయినా..వారిద్దరి మధ్య అవే చివరి మాటలయ్యాయి.
అల్లరిమాటలే నిజమయ్యాయి..! - masques
న్యూజిలాండ్ నరమేధంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాల్లో ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ. వారిలో ఓ అన్నాచెల్లెళ్ల కథ అందర్నీ కంట తడి పెట్టిస్తోంది. వారిద్దరూ మాట్లాడుకున్న అల్లరిమాటలే నిజమయ్యాయి. అన్నయ్య బయటకి వెళ్తూ పలికిన సరదా కబురే చివరి మాటగా మిగిలింది. గత వారం న్యూజిలాండ్ ఉగ్రదాడిలో అన్న మృతి చెందగా అతడి మాటల్ని తలుచుకుని హృద్యంగా విలపిస్తోంది అతని చెల్లి.
అల్లరిమాటలే నిజమయ్యాయి
క్రైస్ట్ చర్చ్ వద్ద జరిగిన ముష్కర దాడిలో ప్రాణాలు కోల్పోయాడు హుస్సేన్. అన్న జ్ఞాపకాలతో కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది అయా. 'సీ యూ బై' అంటూ కడసారి వీడ్కోలు పలికాడంటూ గుర్తు చేసుకుంటోంది. ఇంకా అందని అన్న మృతదేహం కోసం నిరీక్షిస్తోంది. అన్న దేహం ఇంకా మసీదులోనే ఉందా ఆస్పత్రి మార్చురీలో ఉందా అనేది తెలియక గాబరా పడుతోంది అయా. పోలీసులు తమ విధులు నిర్వహించాలి.. అదే సమయంలో బాధిత కుటుంబాలకూ అండగా నిలవాలని అయా కోరుతోంది.