శ్రీలంకలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా 14 మంది చనిపోగా.. ఇద్దరు గల్లంతయ్యారు. 5 వేల మందికిపైగా నిరాశ్రయులయ్యారు.
గురువారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో శ్రీలంకలోని పది జిల్లాల్లో ఇళ్లు, రహదారులు దెబ్బతిన్నాయి. పంటలు నీటమునిగాయి. వర్షాల కారణంగా 600 ఇళ్లు దెబ్బతినట్లు అధికారులు తెలిపారు.