తెలంగాణ

telangana

ETV Bharat / international

'చైనా గని ప్రమాదానికి ఆ 45 మంది కారణం' - gold mine blast

2020, జనవరి 10న చైనా క్విగ్జియా నగరంలోని బంగారు గనిలో జరిగిన ప్రమాదానికి 45 మంది కారణమని దర్యాప్తు బృందం నివేదించింది. వీరిలో 28 మంది అధికారులు సైతం ఉన్నట్లు పేర్కొంది. పేలుడు పదార్థాలను అనధికారికంగా నిల్వ ఉంచినందు వల్లే ప్రమాదం జరిగిందని నివేదిక పేర్కొంది.

45 held accountable for gold mine blast in China
'చైనా గని ప్రమాదానికి 45 మంది కారణం'

By

Published : Feb 23, 2021, 8:00 PM IST

గతేడాది జనవరి 10న చైనా క్విగ్జియా నగరంలోని బంగారు గనిలో జరిగిన పేలుడుకు 45 మంది కారణమని దర్యాప్తు బృందం.. తన నివేదికలో వెల్లడించింది. వీరిలో 28 మంది అధికారులున్నట్లు పేర్కొంది. అనధికారికంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాల కారణంగానే.. గనిలో పేలుడు జరిగిందని నిర్ధరించింది. ప్రమాదాన్ని అధికారులకు చెప్పకుండా గని యాజమాన్యం ఆలస్యం చేసిందని నివేదికలో ఉందని.. స్థానిక న్యూస్ ఏజెన్సీ మంగళవారం తెలిపింది. ఈ ప్రమాదం కారణంగా 10.5 మిలియన్​ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని స్పష్టం చేసింది.

2020, జనవరి 10న చైనాలోని షాండాంగ్ బంగారు గని పేలుడు సంభవించింది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న 22 మంది కార్మికులు​ గనిలోనే చిక్కుకుపోయారు. వీరిలో 11 మందిని కాపాడారు అధికారులు.

ఇదీ చదవండి :చైనా గని ప్రమాదంలో మరో ఇద్దరు సురక్షితం ​ ​

ABOUT THE AUTHOR

...view details