వుహాన్ నగర వ్యాప్తంగా కరోనా పరీక్షలు ముగించిన చైనా.. మరో నగరంలో పరీక్షలు చేయటానికి సిద్ధమైంది. 2.8 మిలియన్ల (28 లక్షలు) జనాభా కలిగిన గుయంగ్డోంగ్ నగరంలో పరీక్షలు చేయనున్నట్లు ఆ దేశ మీడియా తెలిపింది. ఈ సందర్భంగా రష్యా సరిహద్దును తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది.
రష్యా నుంచి తిరిగి వచ్చిన కొంత మంది కారణంగా ఏప్రిల్, మే నెలలో చైనాలోని వివిధ నగరాల్లో కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు భావిస్తున్నారు. ముదాంజియాంగ్ ప్రాంతంలో 15 లక్షణాలు కనపడని కేసులు నమోదైన కారణంగా ఈ నగరంలోనూ పరీక్షలను నిర్వహించాలని చైనా భావిస్తోంది.