పాకిస్థాన్ రావల్పిండిలో ఆదివారం.. బాంబు పేలుడు సంభవించింది. గంజ్ మండి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో.. దాదాపు 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 22 మందిని జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మరో ముగ్గురికి ఘటనాస్థలంలోనే ప్రథమ చికిత్స అందించినట్లు చెప్పారు.
ఈ పేలుడును గ్రనేడ్ దాడిగా భావిస్తున్నామని రావల్పిండి నగర పోలీసు అధికారి(సీపీఓ) మహమ్మద్ అహ్సన్ యూనస్ తెలిపారు. అయితే దీన్ని నిర్ధరించాల్సి ఉందని అన్నారు. నగరంలో.. పదిరోజుల వ్యవధిలో ఈ దాడి జరగడం రెండో సారి అని చెప్పారు.