బాంబు పేలుడుతో వాయవ్య సిరియా ఇడ్లిబ్ ప్రాంతంలోని జిస్ర్ అల్ శుఘుర్ నగరం రక్తమోడింది. పేలుడు ధాటికి నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రుల కోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు.
దుండగుడు ఓ కారు నిండా పేలుడు పదార్థలు నింపుకుని వచ్చి దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.