ప్రస్తుత వేగవంతమైన ప్రపంచాన్ని ఒక్కసారిగా ఎటూ కదలకుండా చేసింది కరోనా వైరస్. స్వేచ్ఛగా, యథేచ్ఛగా తిరిగే మానవాళి కాళ్లకు కళ్లెం వేసి.. ప్రపంచ ధోరణినే మార్చేసింది. ఆయా దేశాల్లోని 170 కోట్ల మందిని ఇళ్లకే పరిమితం చేసింది. ఈ మేరకు ఓ గణాంక సంస్థ నివేదికలో తెలిపింది.
యాభై దేశాల ప్రభుత్వాలు కరోనా లాక్డౌన్ను అమలు చేసి వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పోరాడుతున్నాయి. పాక్షిక లాక్డౌన్, దేశవ్యాప్త కర్ఫ్యూలతో జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
ఫ్రాన్స్, ఇటలీ, అర్జెంటీనా, కాలిఫోర్నియా, ఇరాక్, రువాండా సహా.. దాదాపు 34 దేశాలు పూర్తి బంద్ ప్రకటించాయి. ఈ దేశాల్లోని సుమారు 65 కోట్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. జర్మనీ, బ్రిటన్, ఇరాన్ దేశాలు ప్రజలను ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. దాదాపు 10 దేశాలు పూర్తిగా కర్ఫ్యూ విధించాయి. మరికొన్ని ప్రభుత్వాలు స్వీయ నిర్బంధం దిశగా చర్యలు తీసుకున్నాయి..
రాకపోకలపై ఆంక్షలు..