తెలంగాణ

telangana

ETV Bharat / international

గ్యాస్​ సిలిండర్​ పేలి రైల్లో మంటలు... 65 మంది మృతి - రహీమ్​యార్​ ఖాన్​ సమీపంలో రైలు ప్రమాదం

పాకిస్థాన్​లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కరాచీ-రావల్పిండి తేజ్​గ్రామ్​ ఎక్స్​ప్రెస్​లో లియాఖత్​పుర్​ వద్ద గ్యాస్​ సిలిండర్​ పేలి మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో ఇప్పటివరకు 65 మంది మరణించారు. పలువురికి గాయాలయ్యాయి.

పాకిస్థాన్​లో ఘోర రైలుప్రమాదం

By

Published : Oct 31, 2019, 9:49 AM IST

Updated : Oct 31, 2019, 12:23 PM IST

గ్యాస్​ సిలిండర్​ పేలి రైల్లో మంటలు

పాకిస్థాన్​ రహీమ్​యార్​ ఖాన్​ సమీపంలో.. లియాఖత్​పుర్​ వద్ద ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కరాచీ-రావల్పిండి తేజ్​గ్రామ్​ ఎక్స్​ప్రెస్​లో అగ్నిప్రమాదంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 65 మంది మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

రైలులోని వంటగదిలో అల్పాహారం తయారుచేస్తుండగా.. గ్యాస్​ సిలిండర్​ పేలి మంటలు చెలరేగాయని పాక్​ రైల్వే అధికారులు వెల్లడించారు. విస్తరించిన మంటలతో మొత్తం మూడు కోచ్​లు దగ్ధమయ్యాయి. భయాందోళనకు గురైన ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు.

ఈ దుర్ఘటనపై పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Last Updated : Oct 31, 2019, 12:23 PM IST

ABOUT THE AUTHOR

...view details