తెలంగాణ

telangana

ETV Bharat / international

అఫ్గానిస్థాన్​లో బాంబు పేలుళ్లు- 13 మంది మృతి

అఫ్గానిస్థాన్​లో రెండు వేరువేరు చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 13 మంది మరణించారు. మరో 20 మందికి తీవ్రగాయాలు అయినట్లు అధికారులు తెలిపారు.

13 people were killed and 20 sustained injuries in two seperate blasts in Herat and Laghman province of Afghanistan
అఫ్గానిస్థాన్​లో బాంబు పేలుళ్లు- 13 మంది మృతి

By

Published : Oct 14, 2020, 9:40 PM IST

అఫ్గాన్​లోని హెరత్​, లాఘ్​మన్​ రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ దాడిలో మొత్తం 13 మంది చనిపోయారు. మరో 20 మందికి గాయపడ్డారు. కేష్​-ఈ-కోహ్న జిల్లాలో జరిగిన పేలుడులో అయిదుగురు పౌరులు మరణించగా 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరంతా పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.

మరో పేలుడు అస్మార్​ జిల్లాలో జరిగింది. దీనిలో ముగ్గురు స్థానికులు మరణించగా.. మరో ఏడుగురు క్షతగాత్రులయ్యారు. వారిలో ఒక పోలీసు ఆఫీసరు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఉగ్రదాడి పోలీసు వాహనం లక్ష్యంగా జరిగిందన్నారు. ఈ పేలుళ్ల వెనుక ఏ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందో తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి: 'తాలిబన్లతో ఒప్పందం వల్ల భారత్​కు ఇబ్బంది లేదు'

ABOUT THE AUTHOR

...view details