పాకిస్థాన్లోని సింధు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 13 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు.
సింధూ రాష్ట్రంలోని మూడో అతిపెద్ద నగరం సుక్కూర్కు సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లు జియో న్యూస్ తెలిపింది. ముల్తాన్ నుంచి కరాచీ వేళ్తున్న క్రమంలో బోల్తా పడినట్లు పేర్కొంది. ఆ సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉన్నట్లు తెలిపింది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు, మృతుల్లో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నట్లు వెల్లడించింది.