వేగంగా వెళుతున్న వాహనం అదుపుతప్పి కాలువలో పడింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన 11మంది మృతి చెందారు. అందులో ఏడుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ఘోర దుర్ఘటన పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రం షేక్పురా జిల్లాలో శుక్రవారం జరిగింది. ఖిలా దీదర్ సింగ్ నుంచి ఖాన్ఖా దోగ్రాన్కు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన ప్రదేశానికి చేరుకున్నారు. మృతదేహాల్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.