అఫ్గానిస్థాన్లో భద్రతా దళాలు, తాలిబన్లకు మధ్య భీకర ఘర్షణ జరిగింది. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో 109 మంది తాలిబన్లు హతమయ్యారు. మరో 25మంది గాయపడ్డారు. ఈ మేరకు అఫ్గాన్ సైన్యం శనివారం ఓ ప్రకటన చేసింది.
రెండు రాష్ట్రాల్లో...
కందహార్ రాష్ట్రంలో జరిగిన ఘర్షణలో 70 మంది తాలిబన్లు మృతి చెందగా.. మరో 8 మంది గాయపడ్డారని అఫ్గాన్ సైన్యం చెప్పింది. పొరుగునే ఉన్న హెల్మాండ్ రాష్ట్రంలో జరిగిన ఘర్షణల్లో 39 మంది తాలిబన్లు హతమవగా.. 17మంది గాయపడ్డారని చెప్పింది. అఫ్గాన్ నేషనల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్(ఏఎన్డీఎస్ఎఫ్), అఫ్గాన్ వాయుసేన, పోలీసులు సంయుక్తంగా ఈ తాలిబన్ల ఏరివేత ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.