తెలంగాణ

telangana

ETV Bharat / international

బీచ్​లో ఆడుతూ అలల ధాటికి 10 మంది మృతి

చైనాలోని జాంగ్​జౌ తీరంలో అలల ధాటికి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. బీచ్​లో ఆడుకుంటున్న సమయంలో ఈ దర్ఘటన జరిగింది. మరోవైపు టర్కీలో జరిగిన విమాన ప్రమాదంలో 8 మంది మృతిచెందారు. వీరిలో ఐదుగురు రష్యన్లు, ముగ్గురు స్థానికులు ఉన్నారు.

turkey flight crash
రెండు వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది దుర్మరణం

By

Published : Aug 14, 2021, 10:51 PM IST

శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలోని జాంగ్​జౌ తీరంలో సముద్రంలో కొట్టుకుపోయి 10 మంది ప్రాణాలు కోల్పోగా.. టర్కీలో విమానం కూలి 8 మంది మృతిచెందారు.

చైనాలోని జాంగ్​జౌ తీరంలో సముద్రం అలల ధాటికి 10 మంది బలయ్యారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయాన్ని స్థానిక మీడియా వెల్లడించింది.

చైనాలోని జియాంగ్కో గ్రామం సమీపంలో ఉన్న బీచ్​ వద్ద ఆడుకుంటున్న వారిలో 17 మంది అలల ధాటికి కొట్టుకుపోయారు. వీరిలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరొకరి ఆచూకీ తెలుసుకునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ ఘటనకు మరింత సమాచారం కోసం దర్యాప్తు చేపడుతున్నామని అధికారులు స్పష్టం చేశారు.

టర్కీలో కూలిన విమానం..

దక్షిణ టర్కీ కాహ్రామన్మరాస్​లోని​ పర్వత ప్రాంతాల్లో రష్యాకు చెందిన విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 8 మంది మృతిచెందారు. వీరిలో ఐదుగురు రష్యాకు చెందిన వారు కాగా మరో ముగ్గురు స్థానికులుగా అధికారులు గుర్తించారు. అగ్నిమాపక సేవలు అందించే ఈ విమానం మరికొద్ది సేపట్లో అదానా రాష్ట్రంలో ల్యాండ్​ అవతుంది అనగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ఘటనాస్థలానికి ప్రత్యేక బృందం చేరనుందని తెలిపింది.

ఈ ఘటనపై స్పందిస్తూ.. టర్కీ విదేశాంగ మంత్రి సంతాపం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి :భారత్​ను పొగుడుతూనే.. మోదీ సర్కార్​కు తాలిబన్ల హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details