తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా ఎన్నికల్లో యువత తీర్పే కీలకం! - అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020 యువత ఓట్లు

అమెరికా అధ్యక్ష పోరులో యువత పోలింగ్ శాతం భారీగా పెరిగిన నేపథ్యంలో వీరి ఓట్లు కీలకం కానున్నాయి. సుమారు 80 లక్షల మందికిపైగా పోస్టల్​ బ్యాలెట్ల ద్వారా ఓటు వేసిన కారణంగా.. అధ్యక్షుడి ఎన్నికల ఫలితాల్లో నిర్ణయాత్మకంగా మారే అవకాశం ఉంది.

US-ELECTION-YOUTH
అమెరికా

By

Published : Nov 6, 2020, 8:37 AM IST

ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో యువతరం పోలింగ్‌ శాతం ఈ దఫా భారీగా పెరిగింది. ట్రంప్, బైడెన్ మధ్య పోరు హోరాహోరీగా ఉన్న నేపథ్యంలో వీరి ఓట్లు కీలకంగా మారనున్నాయని ఓ సర్వే తెలిపింది.

‘సెంటర్‌ ఫర్‌ ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆన్‌ సివిక్‌ లెర్నింగ్‌ అండ్‌ ఎంగేజ్‌మెంట్‌ (సర్కిల్‌)’ లెక్కల ప్రకారం.. 18-29 ఏళ్ల మధ్య వయసున్నవారు ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓట్లేశారు. అందులో 80 లక్షల మందికిపైగా పోస్టల్‌ బ్యాలెట్ల ద్వారా తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఈ నేపథ్యంలో వారి ఓట్లు నిర్ణయాత్మకంగా మారనున్నాయి.

ఇదీ చూడండి:6 అడుగుల దూరంలో బైడెన్​- న్యాయపోరాటానికి ట్రంప్

ABOUT THE AUTHOR

...view details