తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​-పాక్​ కోరితేనే కశ్మీర్​పై జోక్యం: ట్రంప్​ - జోక్యం

కశ్మీర్​ సమస్యపై మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇటీవలే అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాశమయ్యాయి. ఇదే విషయంపై తాజాగా మరోసారి స్పందించారు ట్రంప్​. భారత్​-పాక్​ దేశాధినేతలు కోరితేనే మధ్యవర్తిత్వం చేస్తానన్నారు.

భారత్​-పాక్​ కోరితేనే కశ్మీర్​పై జోక్యం: ట్రంప్​

By

Published : Aug 2, 2019, 7:58 AM IST

భారత్​- పాకిస్థాన్​లే కశ్మీర్​ సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఉద్ఘాటించారు. కానీ ఇరు దేశాలు కోరితే సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానన్నారు.

"మోదీ- ఇమ్రాన్​ ఎంతో మంచి వారు. ఇద్దరు ఒకే తాటిపై నడుస్తారని ఆశిస్తున్నా. కానీ నా మధ్యవర్తిత్వం కోరితే... కచ్చితంగా సహకరిస్తా. ఇదే విషయం ఇరుదేశాలకు స్పష్టం చేశాయి."
--- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

ట్రంప్​ వ్యాఖ్యలపై రగడ...

గతవారం పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ అమెరికాలో పర్యటించారు. పాక్​ ప్రధానితో సమావేశమైన అనంతరం అమెరికా అధ్యక్షుడు కశ్మీర్​ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. భారత ప్రధాని మోదీ కూడా ఈ విషయంపై సానుకూలంగా స్పందించారని ట్రంప్​ అన్నారు.

ట్రంప్​ వ్యాఖ్యలను ఇమ్రాన్​ స్వాగతించారు. అగ్రరాజ్య అధ్యక్షుడి ప్రకటనను భారత్​ ఖండించింది. అప్పటికే భారత్​లో ఈ అంశంపై తీవ్ర దుమారం రేగింది. ప్రధాని జవాబు చెప్పాలని విపక్షాలు డిమాండ్​ చేశాయి.

ఇదీ చూడండి:- టెస్టు​ ఛాంపియన్​షిప్:2 ఏళ్లు సాగే క్రికెట్​ యాత్ర

ABOUT THE AUTHOR

...view details