తెలంగాణ

telangana

By

Published : Jul 15, 2020, 12:00 PM IST

Updated : Jul 15, 2020, 4:05 PM IST

ETV Bharat / international

కరోనా విలయం.. అమెరికా, బ్రెజిల్​లో ఉద్ధృతం

ప్రపంచంపై కరోనా ఉద్ధృతి తగ్గడం లేదు. రోజురోజుకూ లక్షకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కొవిడ్​-19 కేసుల సంఖ్య 1.34 కోట్లు దాటింది. ఇప్పటివరకు 5.81లక్షలకుపైగా మరణాలు సంభవించాయి.

WORLDWIDE CORONA VIRUS UPDATES
ప్రపంచవ్యాప్తంగా ఉద్ధృతి తగ్గని కరోనా విలయం

ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. అమెరికా, బ్రెజిల్​, రష్యా, వంటి దేశాల్లో వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉంది. రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్యలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి.

  • మొత్తం కేసులు: 13,462,868
  • మొత్తం మరణాలు: 5,81,317
  • యాక్టివ్​ కేసులు: 50,29,948
  • కోలుకున్నవారు: 78,51,603

అమెరికాలో..

అగ్రరాజ్యంలో వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 35 లక్షల మార్కును దాటింది. దాదాపు 1.40లక్షలకుపైగా మంది ప్రాణాలు కోల్పోయారు. 16లక్షల మందికిపైగా వైరస్​ నుంచి కోలుకున్నారు.

బ్రెజిల్​లో..

వైరస్​ కేసుల సంఖ్యలో రెండో స్థానంలో కొనసాగుతోన్న బ్రెజిల్​లో.. ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 20లక్షలకు చేరువైంది. దాదాపు 75 వేలమంది ప్రాణాలు కోల్పోయారు. 12 లక్షల మందికిపైగా వైరస్​ నుంచి కోలుకున్నారు.

వివిధ దేశాల్లో పరిస్థితి ఇలా

దేశం మొత్తం కేసులు మరణాలు
అమెరికా 35,45,077 1,39,143
బ్రెజిల్​ 19,31,204 74,262
రష్యా 7,39,947 11,614
పెరూ 3,33,867 12,229
చిలీ 3,19,493 7,069
మెక్సికో 3,11,486 36,327
స్పెయిన్​ 3,03,699 28,409
దక్షిణాఫ్రికా 2,98,292 4,346

ఇదీ చూడండి: దేశంలో కొత్తగా 29,429 కేసులు, 582 మరణాలు

Last Updated : Jul 15, 2020, 4:05 PM IST

ABOUT THE AUTHOR

...view details