తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా విలయం- 2.91 కోట్లు దాటిన కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం నాటికి 2.40 లక్షలకుపైగా కొత్తగా వైరస్​బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 91 లక్షలు దాటింది. ఇప్పటి వరకు 2 కోట్ల 10 లక్షల మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. భారత్​, అమెరికాలో ఉద్ధృతి కొనసాగుతోంది. బ్రెజిల్​, రష్యాల్లో తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది.

WORLD CORONA CASES
కరోనా విలయం

By

Published : Sep 14, 2020, 8:07 AM IST

కరోనా మహమ్మారి విలయంలో ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. వేగంగా వ్యాపిస్తూ చిన్నాపెద్ద అనే తేడా లేకుండా చుట్టేస్తోంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం నాటికి 2.40 లక్షల కొత్త కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 91 లక్షలు దాటింది. 9.28 లక్షలకుపైగా వైరస్​కు బలయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 10 లక్షలకుపైగా వైరస్​ నుంచి కోలుకోవటం ఊరట కలిగిస్తోంది. భారత్​, అమెరికాల్లో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. బ్రెజిల్​, రష్యాల్లో వైరస్​ విజృంభణ కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది.

మొత్తం కేసులు: 29,179,972

మరణాలు: 928,208

కోలుకున్నవారు: 21,025,283

యాక్టివ్​ కేసులు: 7,226,481

  • అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఆదివారం 31 వేలకుపైగా కొత్తగా వైరస్​ బారిన పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 67 లక్షలు దాటింది. లక్షా 98వేలకుపైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40 లక్షల మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.
  • బ్రెజిల్​లో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. ఆదివారం కొత్తగా 14వేల పాజిటివ్​ కేసులు వచ్చాయి. శనివారంతో పోల్చితే కొత్త కేసుల్లో సగానికి తగ్గాయి. మొత్తం కేసుల సంఖ్య 43.30 లక్షలకు చేరింది. 1.31 లక్షలకుపైగా వైరస్​కు బలయ్యారు.
  • రష్యాలో కొవిడ్​ మహమ్మారి దాటికి వైరస్​ బారినపడ్డవారి సంఖ్య 10 లక్షలు దాటింది. ఆదివారం దాదాపు 5వేల కొత్త కేసులు వచ్చాయి. ఇప్పటి వరకు 18వేల మందికిపైగా మరణించారు.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసుల వివరాలు ఇలా

దేశం కేసులు మరణాలు
అమెరికా 6,708,458 198,520
బ్రెజిల్​ 4,330,455 131,663
రష్యా 1,062,811 18,578
పెరు 729,619 30,710
కొలంబియా 716,319 22,924
మెక్సికో 668,381 70,821
దక్షిణాఫ్రికా 649,793 15,447

ABOUT THE AUTHOR

...view details