తెలంగాణ

telangana

ETV Bharat / international

అంతరిక్షంలో నడవనున్న అతివలు!

అంతరిక్షంలో వాహననౌక​ నుంచి బయటకు వచ్చి నడవడం సాహసోపేతం. స్పేస్​వాక్​ లాంటివి మనం సినిమాల్లో చూసుంటాం. కానీ దాన్ని నిజం చేయబోతున్నారు ఇద్దరు మహిళా వ్యోమగాములు.

By

Published : Mar 13, 2019, 11:11 AM IST

అంతరిక్షంలోకి తొలి మహిళల బృందం

నాసాకు చెందిన నలుగురు మహిళల బృందం అంతరిక్షంలో బృహత్తర కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇద్దరు వ్యోమగాములు అన్నే మెక్లెయిన్​, క్రిస్టినా కోచ్​లు అంతరిక్షంలో నడవనున్నారు. ఈ నెల 29న అంతర్జాతీయ పరిశోధనా కేంద్రం నుంచి బయటకు వెళ్లి ఓ కృత్రిమ ఉపగ్రహాన్ని రిపేరు చేయనున్నారు.

  • ఎంత దూరమో తెలుసా...?

ఇద్దరు వ్యోమగాములు భూమికి 386 కిమీ దూరంలో ఈ పని చేయనున్నారు. అంతరిక్షంలో నడిచేటపుడు కంట్రోల్స్​ మొత్తం వ్యోమగాముల చేతిలోనే ఉండనున్నాయి. బృందంలో మిగిలిన ఇద్దరు మహిళల్లో ఫ్లైట్​ కంట్రోలర్​​ గా ఒకరు, ఫ్లైట్​ డైరెక్టర్​గానూ వ్యవహరించనున్నారు. వీళ్ల బృందానికి కెనడియన్​ స్పేస్​ ఏజెన్సీకి చెందిన ఫ్లైట్​ కంట్రోలర్​ క్రిస్టన్​ గ్రౌండ్​​ సపోర్టు ఇవ్వనున్నారు.

'మార్చి29న ఈ మహిళలు అంతరిక్షంలో నడవనున్నారు. ఇది రెండో స్పేస్​ వాక్​. మరొకటి తర్వాత చేయనున్నాం. కానీ తొలిసారి అందరూ మహిళలే వెళ్తుండటం గొప్ప విషయం. అక్కడ పాత ఉపగ్రహానికి బ్యాటరీలు మార్చనున్నారు'.
-
స్టిఫనీ సిర్హోల్జ్, నాసా మీడియా ప్రతినిధి

చరిత్రలో తొలిసారి

అంతరిక్షంలో నడక వ్యోమగాములకు సాధారణ విషయం. ఇలాంటివి అంతరిక్ష పరిశోధనా కేంద్రం వద్ద ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అయితే స్పేస్​లో పనిచేసే 500 మందిలో 11 శాతం మాత్రమే మహిళలు ఉంటారు. ఎప్పుడు స్పేస్ వాక్​ జరిగినా కేవలం పురుషులు, లేకుంటే పురుషులు-మహిళలు బృందంగా వెళ్తుంటారు. తొలిసారి మహిళలు మాత్రమే అంతరిక్షంలో ప్రయాణించనున్నారు.

  • వ్యోమగామి అన్నే మెక్లెయిన్​ అమెరికా ఆర్మీలో పైలట్​గా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈమె స్పేష్​​ స్టేషన్​లో ఉండగా.. కూచ్​ తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఈవిడ ఎలక్ట్రికల్​ ఇంజినీరు. మార్చి 14న భూమి నుంచి అక్కడకు పయనమవుతారు.

ఎప్పుడీ నడక...


ఈ స్పేస్​​ వాక్​ నాసా టీవీలో ప్రత్యక్ష​ ప్రసారం కానుంది. ఈ నెల 29న అంతర్జాతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 5గంటలకు ప్రసారం అవుతుంది.

ABOUT THE AUTHOR

...view details