తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా భయాలు బేఖాతరు- అమెరికాలో యథావిధిగా ఎన్నికలు - అమెరికా ఎన్నికలు

అమెరికాపై కరోనా వైరస్ ప్రతాపం చూపుతున్నప్పటికీ.. అధ్యక్ష పదవి కోసం ఓటింగ్ కొనసాగింది. ఎన్నికలు వాయిదా వేయాలని డెమొక్రాట్ల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ.. పోలింగ్​ను యథావిధిగా నిర్వహించారు అధికారులు. ఎన్నికల సిబ్బంది కొరత కారణంగా ఓటర్లు ఇబ్బందులకు గురయ్యారు.

us voting
అమెరికా ఎన్నికలు

By

Published : Apr 8, 2020, 11:21 AM IST

కరోనా వైరస్ తీవ్రమవుతున్నప్పటికీ అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక ఎన్నికల్లో పాల్గొనేందుకు మాడిసన్ రాష్ట్రంలోని విస్కాన్సిన్ ఓటర్లు పోలింగ్ స్టేషన్ల ఎదుట క్యూ కట్టారు. వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అక్కడి ప్రభుత్వం సూచనలు చేసినప్పటికీ.. పలువురు వాటిని పెద్దగా పట్టించుకోలేదు.

పలు సెంటర్లలో ఓటింగ్​కు ఇబ్బందులు తలెత్తాయి. రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన మిల్వాకీలోని 180 పోలింగ్ స్టేషన్లలో 5 కేంద్రాల్లో మాత్రమే ఓటింగ్ జరిగింది. కరోనా నేపథ్యంలో చాలావరకు ఎన్నికల సిబ్బంది విధులకు గైర్హాజరు కావడం వల్ల ఓటర్లు గంటల తరబడి లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరికొందరు మాత్రం కరోనా భయంతో ఓటింగ్​కు దూరంగా ఉన్నారు. గైర్హాజరు బ్యాలెట్లను తమకు అందించడం లేదని ఆరోపించారు.

వాయిదాపై పోరు!

అమెరికాలో వైరస్ ప్రమాదకర స్థాయిలో వ్యాపిస్తున్నప్పటికీ ఓటింగ్ మాత్రం సజావుగా జరిగేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఓటింగ్ వాయిదా వేయాలని డెమొక్రాట్ల నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ.. షెడ్యూల్ ప్రకారం పోలింగ్ నిర్వహిస్తున్నారు.

డెమొక్రటిక్ సభ్యులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం తీవ్ర విమర్శలు చేశారు. ఓటింగ్ వాయిదా వేసేందుకు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంట్లోనే ఉండాలన్న వైద్యుల సూచనలను సైతం తప్పుబడుతూ.. బయటకు వచ్చి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

రిపబ్లికన్ల తీరుపై డెమొక్రాట్లు మండిపడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తూ ఎన్నికలు నిర్వహించడాన్ని తప్పుబట్టారు.

ఈ రాష్ట్రం కీలకం

నామినేషన్ పోటీలో బెర్నీ శాండర్స్​ను దెబ్బకొట్టేందుకు ఈ రాష్ట్ర ఫలితాలు కీలకంగా వ్యవహరిస్తాయని అధ్యక్ష బరిలో ఉన్న మరో అభ్యర్థి జో బిడెన్ ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోనే అత్యధిక నల్లజాతీయులు మిల్వాకీ నగరంలో ఉన్నారు. ఈ మైనారిటీల ఓట్ల శాతం తగ్గితే రిపబ్లికన్లకు మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ దేశంలో ప్రబలుతున్న కొవిడ్-19 మహమ్మారి అధ్యక్ష ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

విస్కాన్సిన్ నగరంలో ఇప్పటివరకు 2500 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 92 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు. ఇందులో 49 మరణాలు మిల్వాకీ కౌంటీలోనే సంభవించాయి.

కరోనా ప్రబలుతున్నా అమెరికాలో యథావిధిగా ఓటింగ్

ఇదీ చదవండి:ట్రంప్ సర్కార్​లో కరోనా చిచ్చు- మంత్రి రాజీనామా

ABOUT THE AUTHOR

...view details