కొవిడ్-19ను అరికట్టేందుకు త్వరలోనే టీకా రావాలని బిల్‌గేట్స్ చాలాసార్లు అన్నారు. ఈ మేరకు అన్ని దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేయాలని సూచించారు. అంతేకాకుండా.. ఎలాంటి మహమ్మారినైనా ఎదుర్కోవడానికి ఒక వ్యాక్సిన్ సిద్ధంగా ఉండాలని కూడా పేర్కొన్నారు బిల్‌గేట్స్.
అయితే వీటి ఆధారంగా బిల్‌గేట్స్‌పై కుట్ర సిద్ధాంతాలు ఇంటర్‌నెట్‌లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. కరోనా వైరస్ ఆవిర్భావానికి ఆయనే కారణమన్న ఓ వీడియోను యూట్యూబ్‌లో కోట్ల సంఖ్యలో వీక్షించారు. కరోనా వ్యాక్సిన్ ద్వారా భూమిపై కనీసం 15 శాతం జనాభాను హతం చేయాలన్నది ఆయన లక్ష్యమని అందులో పేర్కొనడం గమనార్హం.
తనపై సాగుతున్న కుట్ర సిద్ధాంతాలపై బిల్‌గేట్స్ స్పందించారు.
'మహమ్మారి, సామాజిక మాధ్యమాలది ఓ దుష్ట కలయిక. ప్రజలు తేలికైన వివరణ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలని ఇతర స్వచ్ఛంద సంస్థల కన్నా ఎక్కువ డబ్బు ఖర్చుచేస్తున్నాం.'
- బిల్‌గేట్స్, మైక్రోసాఫ్ట్ స్థాపకుడు