తెలంగాణ

telangana

ETV Bharat / international

కార్చిచ్చు విధ్వంస చిత్రం- ఆ దేశాలు హడల్ - algeria wildfires

ఇన్నాళ్లూ అమెరికా కాలిఫోర్నియాలోని అడవుల్ని దహించివేసిన కార్చిచ్చు.. ఇతర దేశాలనూ బెంబేలెత్తిస్తోంది. అల్జీరియా, టర్కీ, ఇటలీ దేశాల్లో చెలరేగిన మంటలకు వేల హెక్టార్లు దగ్ధమయ్యాయి. అనేక మంది తమ స్వస్థలాలను విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు.

WILDFIRES
కార్చిచ్చు విధ్వంస దృశ్యాలు

By

Published : Aug 11, 2021, 12:16 PM IST

అల్జీరియాలోని పలు ప్రాంతాల్లో చెలరేగిన కార్చుచ్చుకు 42 మంది బలయ్యారు. ఇందులో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన 25 మంది సైనికులు కూడా ఉన్నారు. చనిపోయిన సైనికులు 100 మంది ప్రజల ప్రాణాలను కాపాడారని అల్జీరియా అధ్యక్షుడు అబ్దెల్ మజీద్ టెబ్బౌనె ట్వీట్ చేశారు. మరో 11 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.

టిజి ఔజూ పట్టణంలోని ఓ గ్రామంలో ఎగసిపడుతున్న మంటలు, పొగ
మంటలకు పూర్తిగా కాలిపోయిన చెట్లు

గ్రీస్

గ్రీస్​లో ఇదివరకెన్నడూ చూడని కార్చిచ్చు చెలరేగింది. వేల హెక్టార్ల అటవీ భూమి దగ్ధమైంది. 60 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోకి తరలించారు. ఓ అగ్నిమాపక దళ సిబ్బంది మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎనిమిది రోజుల్లో 586 కార్చిచ్చు ఘటనలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యంత ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు కూడా ఏడాదికి 40 ఘటనలు మాత్రమే జరిగేవని పేర్కొన్నారు.

ఏవియా ఐలాండ్, అగియా అన్నా గ్రామంలోని ఓ బీచ్ వద్ద... ఓ వైపు పూర్తిగా కాలిపోయిన కొండ దృశ్యం
ఏవియా ఐలాండ్​లో అగ్నికి ఆహుతైన కొండ
మంటలను ఆర్పేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
స్లొవేకియాకు చెందిన అగ్నిమాపక దళ సిబ్బంది. అలసిపోయి.. కింద కూర్చొని నీళ్లు తాగుతున్న చిత్రం.

అమెరికా

కాలిఫోర్నియాలో గతకొద్దివారాలుగా మండుతున్న కార్చిచ్చుకు 900 భవనాలు తగలబడిపోయాయి. సమీపంలో ఉన్న అడవులను మంటలు దహించివేస్తున్నాయి. 6 వేల మంది అగ్నిమాపక దళ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. హెలికాప్టర్ల సాయంతో రసాయనాలను చల్లుతున్నారు.

కాలిఫోర్నియాలో భవనాలను మింగేసిన కార్చిచ్చు
పూర్తిగా కాలిపోయిన వాహనం
కాలిబూడిదైన వస్తువులు, వాహనాలు

ఇటలీలోనూ కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది.

సిసిలీలోని బ్లఫీ మున్సిపాలిటీలో మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్న వలంటీర్లు
ముంచుకొస్తున్న కార్చిచ్చు
బ్లఫీ మున్సిపాలిటీలో చెట్లను దహించివేసిన కార్చిచ్చు
చెలరేగుతున్న మంటలు
పెట్రాలియా సొప్రానా ప్రాంతంలో మంటలను నీటితో ఆర్పుతున్న విమానం
అడవిని ఆవహించి, ఓ ఇంటి దగ్గరికి వ్యాపిస్తున్న దావానలం

టర్కీలో అనేక హెక్టార్ల భూమి మంటలకు ఆహుతైంది.

కొయ్​సెగీజ్​లో మంటలు ఆర్పే ఆపరేషన్​లో పాల్గొన్న హెలికాప్టర్
హెలికాప్టర్​తో మంటలు ఆర్పేందుకు యత్నం
నీటిని జారవిడుస్తున్న హెలికాప్టర్
ముగ్లాలోని కొయ్​సెగీజ్​లో ఎగసిపడుతున్న అగ్నికీలలు
మంటల ధాటికి తమ ప్రాంతం విడిచి వెళ్తున్న స్థానికులు

ఇదీ చదవండి:కాలిఫోర్నియాలో భయానక దృశ్యాలు

ABOUT THE AUTHOR

...view details