ఓవైపు కరోనా వైరస్ విజృంభిస్తుంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు అమెరికా శాశ్వతంగా నిధులను నిలిపివేస్తామని హెచ్చరించడం తీవ్రంగా కలవరపెడుతోంది. దీని వల్ల ప్రపంచంలోని బలహీన వర్గాలకు అత్యవసర ఆరోగ్య సేవలు అందించడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయని డబ్ల్యూహెచ్ఓ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఈ విషయంపై డబ్ల్యూహెచ్ఓలోని అత్యవసర విభాగాధిపతి డా. మైకెల్ ర్యాన్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అందించే నిధులను ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవల కోసం ఉపయోగిస్తామని పేర్కొన్నారు. నిధుల కొరతను పూడ్చడానికి ఇతరులతో కలిసి పనిచేయాల్సి వస్తుందని వెల్లడించారు.