కరోనా.. వన్య ప్రాణులనూ (corona virus in animals) విడిచిపెట్టడం లేదు! ఉత్తర అమెరికాలోని 40% జింకల్లో కొవిడ్ యాంటీబాడీలు పుష్కలంగా ఉన్నట్టు తాజా పరిశోధనలో తేలింది. బాంగోర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గ్రయీమ్ షానన్, అమీ గ్రేషమ్, ఒవైన్ బార్టన్‌లు ఈ విషయాలను పంచుకున్నారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో- మనిషికి ఈ వైరస్ ఎలా సోకింది? మనిషి నుంచి ఇది ఏయే జీవులకు సోకే ముప్పుంది? అన్న అంశాలపై పెద్ద చర్చలే నడిచాయి. ఇళ్లు, జనావాసాల్లో తిరిగే కుక్కలు, పిల్లులు, జంతు ప్రదర్శనశాలల్లోని మూగజీవులకు కరోనా వ్యాపించవచ్చని పరిశోధకులు భావిస్తూ వచ్చారు. కానీ, వన్యప్రాణులు కూడా భారీగానే మహమ్మారికి గురైనట్టు తాజా పరిశోధన తేల్చింది. మిషిగాన్, పెన్సెల్వేనియా, ఇలినాయిస్, న్యూయార్క్ ప్రాంతాల్లో ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య పరిశోధకులు వన్యప్రాణులకు పరీక్షలు నిర్వహించారు. తెల్లరంగు తోక ఉండే 40% జింకల్లో కొవిడ్ యాంటీబాడీలు తీవ్రస్థాయిలో ఉన్నట్టు తేలింది! అంతకుముందు లోవా ప్రాంతంలో చేపట్టిన పరీక్షల్లోనూ 80% జింకల్లో కొవిడ్ వ్యాపించినట్టు ప్రాథమికంగా వెల్లడైంది. వన్యప్రాణుల సంరక్షణ, పరిశోధనలు, పర్యాటకం, వేట తదితర కార్యకలాపాల వల్ల మనిషి నుంచి జింకలకు వైరస్ సంక్రమించి ఉండొచ్చని పరిశోధకులు భావించారు.
నాలుగు సింహాలకు..