భారీ వర్షాలకు అమెరికా రాజధాని వాషింగ్టన్ ఉక్కిరిబిక్కిరైంది. రోడ్డు, రైలు రవాణా వ్యవస్థలు స్తంభించాయి. భారీ వరదలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వాషింగ్టన్లో కారులే పడవలయ్యాయి..! - అమెరికా
అమెరికా రాజధాని వాషింగ్టన్ను వర్షాలు ముంచెత్తాయి. సోమవారం కురిసిన భారీ వర్షానికి రోడ్డు, రైలు రవాణా వ్యవస్థ స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
అమెరికా రాజధాని వాషింగ్టన్లో భారీ వర్షం
నగరంలోని చాలా ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వర్షాలకు శ్వేతసౌధంలోని ఓ విభాగం ప్రభావితమైంది.
Last Updated : Jul 9, 2019, 5:37 AM IST