తెలంగాణ

telangana

ETV Bharat / international

45 మందిపై అమెరికా 'కరోనా వ్యాక్సిన్'​ పరీక్షలు

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారిని నివారించేందుకు అమెరికా ముందడుగేసింది. వ్యాక్సిన్​ తయారీ చర్యలను మరింత వేగవంతం చేసిన అగ్రరాజ్యం.. ఇవాళ కొందరు యువకులపై తాము తయారుచేసిన వ్యాక్సిన్​ను ప్రయోగించింది.

COVID-19 vaccine
45 మందిపై అమెరికా కరోనా వ్యాక్సిన్​ పరీక్షలు

By

Published : Mar 17, 2020, 5:37 AM IST

Updated : Mar 17, 2020, 6:13 AM IST

45 మందిపై అమెరికా కరోనా వ్యాక్సిన్​ పరీక్షలు

కొద్దిరోజులుగా కంటిపై కునుకులేకుండా చేస్తున్న కరోనా వైరస్​కు విరుగుడు కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆ ప్రయత్నంలో అమెరికా తొలి అడుగు వేసింది. వైరస్​ను అరికట్టే చర్యల్లో భాగంగా ఓ వ్యాక్సిన్​ను రూపొందించింది. అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో తయారుచేసిన ఈ టీకాను నేడు తొలిసారిగా కొందరి యువకులపై ప్రయోగించారు.

ఎమ్​ఆర్​ఎన్​ఏ-1273

ఆమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ(ఎన్​ఐహెచ్​), మసాచుసెట్స్​ ఆధారిత బయోటెక్నాలజీ సంస్థ తయారుచేసిన వ్యాక్సిన్​ను.. ఎమ్​ఆర్​ఎన్​ఏ-1273 కోడ్​తో ఓ అభ్యర్థిపై ప్రయోగించారు. అదేవిధంగా వైరస్​ సోకని 45 మంది యువ వలంటీర్లపై వేరు వేరు డోసులుగా ఈ వ్యాక్సిన్​ను ప్రయోగించారు. అయితే వాళ్ల శరీరంలో వైరస్​ లక్షణాలు లేనందున ఎలాంటి దుష్ప్రభావం చూపలేదని వైద్యులు స్పష్టం చేశారు.

'వ్యాక్సిన్​ను కనుగొనడంలో ఇది మొదటి ప్రయత్నం. కాబట్టి మా లక్ష్యాలు తొలిదశలోనే ఉన్నాయి. మా తొలి ప్రాధాన్యత భద్రతే.. ఆ తర్వాతే మిగతావి. మేం రోగ నిరోధక ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది పరీశించాలనుకున్నాం. నిర్దిష్ట ప్రోటీన్​కు వ్యతిరేకంగా ఉత్పత్తిచేసే ప్రతినిరోధకాలను తయారుచేయాలి.'

- డాక్టర్​ లిసా జాక్సన్​, కైసర్​ పర్మనెంటె విచారణాధికారి

12 నుంచి 18 నెలల సమయం..

సియాటెల్​లోని కైసర్​ పర్మనెంటె వాషింగ్​టన్​ ఆరోగ్య పరిశోధనా సంస్థ వేదికగా నిర్వహిస్తున్న ఈ ప్రయోగానికి అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ నిధులు సమకూరుస్తోంది. అయితే ఏ వ్యాక్సిన్​ అయినా పూర్తిస్థాయిలో పనిచేయాలంటే దానికి కనీసం ఏడాది నుంచి ఏడాదిన్నర కాలవ్యవధి పడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:కరోనా ఎఫెక్ట్​: సరిహద్దుల మూసివేత

Last Updated : Mar 17, 2020, 6:13 AM IST

ABOUT THE AUTHOR

...view details