తెలంగాణ

telangana

ETV Bharat / international

హింసాత్మకంగా 'నిప్సీ హసిల్' అభిమానుల ర్యాలీ - rapper

అమెరికాకు చెందిన ప్రఖ్యాత ర్యాపర్ 'నిప్సీ హసిల్' హత్యకు నిరసనగా అభిమానులు చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీ హింసకు దారితీసింది. లాస్​ ఏంజెల్స్​లో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. నిప్సీ హత్యకేసులో నిందితుడిగా అనుమానిస్తున్న 'ఎరిక్​ హోల్డర్'​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హింసాత్మకంగా 'నిప్సీ హసిల్' అభిమానుల ర్యాలీ

By

Published : Apr 2, 2019, 6:11 PM IST

హింసాత్మకంగా 'నిప్సీ హసిల్' అభిమానుల ర్యాలీ
అమెరికా లాస్​ ఏంజెల్స్​లో ప్రముఖ ర్యాపర్​​ నిప్సీ హసిల్ హత్యకు నిరసనగా అభిమానులు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీ హింసకు దారితీసింది. సోమవారం 300 నుంచి 400 మంది అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ గుంపులో ఆకస్మికంగా గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు బాటిళ్లు విసురుకున్నారు. అందరూ ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. అది కాస్తా తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు, మరో ఐదుగురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపుచేశారు.

పోలీసుల అదుపులో ర్యాపర్​ హత్యకేసు నిందితుడు

ర్యాపర్​​ 'నిప్సీ హసిల్' హత్యకేసులో నిందితుడిగా భావిస్తోన్న 29 ఏళ్ల 'ఎరిక్​ హోల్డర్'​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు నంబర్ ప్లేటు ఆధారంగా 'ఎరిక్​'ని పట్టుకున్నట్లు తెలిపారు.​

ఆదివారం మధ్యాహ్నం దక్షిణ లాస్​ ఏంజెల్స్​లోని తన సొంత వస్త్ర దుకాణం ముందు 'నిప్సీ'ని తుపాకీతో కాల్చిచంపాడు దుండగుడు.

ఇదీ చూడండి :'జనాకాంక్షలకు ఆ విగ్రహాలే ప్రతిరూపాలు'

ABOUT THE AUTHOR

...view details