తెలంగాణ

telangana

ETV Bharat / international

'భారత్​, చైనా వివాద పరిష్కారానికి సాయం చేస్తాం' - భారత్ చైనా వివాదంపై ట్రంప్

భారత్, చైనా సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలను దుష్ట పరిస్థితులతో పోల్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ విషయంలో జోక్యం చేసుకుని సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పునరుద్ఘాటించారు.

US-TRUMP-INDIA CHINA
డొనాల్డ్ ట్రంప్

By

Published : Sep 5, 2020, 6:49 AM IST

భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు మరోసారి స్పందించారు. చైనా మరింత బలంగా దూకుడుగా వెళుతోందని ఆరోపించారు. ఈ వివాదాన్ని పరిష్కారించేందుకు రెండు దేశాలకు సాయం చేస్తామని చెప్పారు.

"భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చాలా తీవ్రంగా ఉన్నాయి. తాజా పరిస్థితులపై రెండు దేశాలతో సంప్రదిస్తున్నాం. అవసరమైతే ఈ విషయంలో జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి ఇరు దేశాలకు సాయం చేస్తాం" అని ట్రంప్ పునరుద్ఘాటించారు.

భారత్​ను చైనా బెదిరిస్తుందా అన్న ప్రశ్నకు ట్రంప్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

"నాకు తెలిసి బెదిరింపు కాకపోవచ్చు. కానీ, ప్రజలు అర్థం చేసుకునే దానికన్నా బలంగా ముందుకు వెళుతున్నారు. ఈ సమయంలో రష్యా కన్నా చైనా గురించి ఎక్కువగా చర్చించాల్సి ఉంది. మరీ దారుణంగా ప్రవర్తిస్తోంది. చైనా వైరస్ వల్ల 188 దేశాలు బాధపడుతున్నాయి. చైనా చేసిన పనికి అమెరికా, ఐరోపా సహా ప్రపంచంలోని అన్ని దేశాల్లో పరిస్థితులు భయానకంగా మారాయి."

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ఇదీ చూడండి:సరిహద్దులో ట్యాంకుల 'రణ'గొణ ధ్వనులు!

ABOUT THE AUTHOR

...view details