తెలంగాణ

telangana

ETV Bharat / international

విద్యుత్​ కోత, నీటి కొరతతో దుర్భర జీవితం - power

విద్యుత్​ సంక్షోభంతో మరోమారు అంధకారంలోకి వెళ్లింది వెనెజువెలా. రోజుల తరబడి కరెంట్ లేక నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. నీరు దొరికే ప్రాంతాల్లో గంటల తరబడి వేచి ఉంటున్నారు.

విద్యుత్​ కోత, నీటి కొరతతో దుర్భర జీవితం

By

Published : Mar 28, 2019, 3:16 PM IST

వెనుజువెలాలో విద్యుత్​ కోత, నీటి కొరతతో దుర్భర జీవితం
వెనెజువెలాను విద్యుత్​ సంక్షోభం వెంటాడుతోంది. సంక్షోభం నుంచి తేరుకుంటున్న తరుణంలో మరోమారు అంధకారంలోకి వెళ్లింది. రోజుల తరబడి విద్యుత్​ సరఫరా నిలిచిపోవటం వల్ల నీటి సమస్య తలెత్తింది. ఇంట్లోని నీటి ట్యాంకులు, నల్లాల నుంచి నీరు వచ్చే పరిస్థితులు లేవు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

దేశ రాజధాని కారకస్​లో రోడ్ల వెంట దుకాణాలన్నీ తిరిగినా... బాటిల్​ నీరు దొరకని దుస్థితి. నగరంలోని కొండలపై నుంచి వచ్చే నీటిని పట్టుకోవటానికి గంటల పాటు సమయం వెచ్చించాల్సి వస్తోంది.

"నీరు పట్టుకోవటానికి నేను ఇక్కడికి వచ్చి కొన్ని గంటల పాటు వేచి ఉన్నాను. మేము నీటి కోసమే ప్రత్యేకించి ఉన్నాము. చిన్నపిల్లలకు ఆహారం అందించాలి. మాకోసం ఆహారం తయారు చేసుకోవాలి."
- జోస్​ రిన్​కోన్​, కారకస్​ స్థానికుడు

విద్యుత్​ సంక్షోభంతో పాఠశాలలు, కార్యాలయాలు, దుకాణాలు, పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. కాలినడకనే కార్యాలయాలకు వెళుతున్నారు.

ఇదీ చూడండీ: విద్యుత్ సంక్షోభంతో మరోసారి అంధకారంలో వెనెజువెలా

ABOUT THE AUTHOR

...view details