తెలంగాణ

telangana

ETV Bharat / international

'టీకా జాతీయవాదంతో కరోనా 'కొత్త' ముప్పు'

ప్రపంచంలోని అన్ని దేశాలకు టీకాలు సమానంగా పంచినప్పుడే కరోనా కట్టడి సాధ్యమవుతుందని అమెరికా, కెనడా శాస్త్రవేత్తలు తెలిపారు. లేదంటే కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Vaccine nationalism
వ్యాక్సిన్ జాతీయవాదం

By

Published : Aug 19, 2021, 4:43 AM IST

ప్రపంచంలోని అన్ని దేశాలకు టీకాలు సమానంగా పంచాలని, అప్పుడే కరోనా కట్టడి సాధ్యమవుతుందని, లేకపోతే కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని అమెరికా, కెనడా శాస్త్రవేత్తలు హెచ్చరించారు. వ్యాక్సిన్ జాతీయవాదంతో మహమ్మారి ప్రభావం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని దేశాల దగ్గరే వ్యాక్సిన్ నిల్వలు పేరుకుపోవడం సరికాదని పేర్కొన్నారు.

టీకాల పంపిణీలో అసమానతలు చూపిస్తున్న ప్రభావంపై వీరు అధ్యయనం చేశారు. "కొవిడ్-19 మహమ్మారి అధికంగా ఉన్న దేశాలకు తక్కువ వ్యాక్సిన్లు అందుతున్నాయి. తక్కువ కేసులు నమోదవుతున్న దేశాలకు ఎక్కువ వెళుతున్నాయి. ఫలితంగా టీకాలు అధికంగా అందుకున్న దేశాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయి. మిగతా దేశాల్లో మాత్రం మహమ్మారి ఉద్ధృతి పెరుగుతోంది. దీంతో కొత్త వేరియంట్లు విజృంభించే అవకాశం ఉంది" అని ఈ అధ్యయనంలో పాల్గొన్న కెనడాకు చెందిన మెక్ హెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కరోలిన్ వాగ్నర్ తెలిపారు.

గంటకు 42 మంది మృతి..!

మరోవైపు.. యావత్‌ ప్రపంచాన్ని కరోనా వైరస్‌ మహమ్మారి వణికిస్తూనే ఉంది. ముఖ్యంగా వైరస్‌ ప్రభావానికి తీవ్రంగా నష్టపోయిన అగ్రరాజ్యం అమెరికాలో వ్యాక్సినేషన్‌ రావడం వల్ల కాస్త అదుపులోకి వచ్చినట్లు కనిపించింది. కానీ డెల్టా వంటి కొత్తరకాలు వెలుగు చూడగా తాజాగా అక్కడ వైరస్‌ తీవ్రత మరోసారి పెరిగింది. దీంతో రోజువారీ కొవిడ్‌ మరణాల సంఖ్య వెయ్యి దాటగా.. సరాసరి గంటకు 42 మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఇదీ చూడండి:'టీకా విషయంలో జాతీయవాదం తగదు'

ఇదీ చూడండి:'టీకా దాచుకుంటున్నారు.. అది తప్పుడు చర్య'

ABOUT THE AUTHOR

...view details