తెలంగాణ

telangana

ETV Bharat / international

సైకోల్లో అతడే అతి క్రూరుడు- 93 హత్యలు! - 93 మందిని చంపినట్లు విచారణ

35 ఏళ్లు... 93 హత్యలు...! ఓ 79 ఏళ్ల సైకో నేర చరిత్ర ఇది. అమెరికాలోనే అత్యంత క్రూరమైన సీరియల్ కిల్లర్ అతడే అంటున్నారు అధికారులు. ఇప్పటివరకు 50 హత్య కేసుల్లో అతడి పాత్రను నిర్ధరించారు. మిగిలిన కేసుల పనిబట్టేందుకు యత్నిస్తున్నారు.

అమెరికా: రికార్డు స్థాయిలో హత్యలు చేసి.. పట్టుపడ్డాడు!

By

Published : Oct 7, 2019, 5:11 PM IST

సైకో కిల్లర్​ కథాంశంగా హాలీవుడ్​లో ఎన్నో చిత్రాలు వచ్చాయ్. పెద్దగా కారణాలు లేకుండానే ఓ వ్యక్తి అతి కిరాతకంగా వరుస హత్యలు చేసే దృశ్యాలు... సినీ ప్రేక్షకులను భయపెడతాయి. బాక్సాఫీస్​ వద్ద కాసుల వర్షం కురిపిస్తాయి. అలాంటి ఓ సైకో నిజ జీవితంలో ఉంటే...?

ఎఫ్​బీఐ చెప్పిన కథ...

శామ్యూల్​ లిటిల్​.... వయసు 79 ఏళ్లు. అమెరికా వాసి. 1970-2005 మధ్య ఏకంగా 93 హత్యలు చేశాడు. మృతుల్లో మహిళలే అధికం. ఈ విషయాన్ని అతడే స్వయంగా అంగీకరించాడు.
మాజీ బాక్సర్ శామ్యూల్​ చెప్పిన వివరాలను తన వెబ్​సైట్​లో ఉంచింది అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్​ ఇన్​వెస్టిగేషన్​. 50 హత్యలు కచ్చితంగా శామ్యూల్​ చేసినవేనని నిర్ధరించింది. మిగిలినవాటి కోసం ఆధారాలు సేకరించే పనిలో ఉంది.

అప్పటి నుంచి జైల్లోనే...

వరుస హత్యలు చేసే శామ్యూల్​... తనను ఎవరూ పట్టుకోలేరని అనుకునేవాడు. తన చేతిలో చనిపోయిన వారి గురించి పెద్దగా పట్టించుకునేవారు లేరన్న నమ్మకమే ఇందుకు కారణం. కానీ... 2012లో అతడి పాపం పండింది. మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయ్యాడు. డీఎన్ఏ పరీక్షలు చేయగా 1987-89 మధ్య జరిగిన 3 హత్య కేసులతో అతడికి సంబంధం ఉన్నట్లు తేలింది.

3 హత్య కేసుల్లో శామ్యూల్​కు 2014లో జీవితఖైదు పడింది. అప్పటినుంచి జైల్లోనే ఉన్నాడు. అయితే... ప్రతి కేసులోని నిజానిజాలు తేల్చి, బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపింది ఎఫ్​బీఐ.

ఇదీ చూడండి : ముఖానికి మాస్క్​ వేసుకున్నారని ఇద్దరిపై కేసు

ABOUT THE AUTHOR

...view details