తెలంగాణ

telangana

ETV Bharat / international

మిత్రదేశాలతో సంబంధాలు పునరుద్ధరిస్తాం: బైడెన్​

ప్రపంచదేశాలతో మైత్రిని పెంపొందించుకునేందుకు సమాయత్తమవుతున్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లపై ఉమ్మడి పోరు అవసరమని తెలిపారు.

biden on diplomacy
'ప్రపంచ దేశాలతో మైత్రి దిశగా అమెరికా'

By

Published : Feb 5, 2021, 9:57 AM IST

ప్రపంచంతో మరోసారి అనుసంధానం అయ్యేందుకు... అమెరికా భాగస్వామ్య పక్షాలను పునఃనిర్మించుకోవాల్సి ఉందని అధ్యక్షుడు జోబైడెన్ స్పష్టం చేశారు. గతం గురించి కాకుండా ప్రస్తుతం, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సమాయత్తం కావాల్సి ఉందని తెలిపారు.

"ప్రపంచానికి సవాల్​​గా పరిణమించిన కరోనా మహమ్మారి, వాతావరణ సంక్షోభం, అణు విస్తరణను ప్రపంచ దేశాలు ఉమ్మడిగా పరిష్కరించాలి. వీటిని అమెరికా ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యం కాదు."

-బైడెన్​, అమెరికా అధ్యక్షుడు

ప్రజాస్వామ్య దేశాల బలాన్ని విస్తరించేందుకు అమెరికా భాగస్వామ్య కూటమి నాటో దేశాధినేతలతో మాట్లాడానని బైడెన్​ తెలిపారు. అమెరికా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే గత పాలకుల కంటే భిన్నంగా స్పందించాల్సి ఉంటుందని రష్యాను హెచ్చరించారు. అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం సహా సైబర్ దాడులకు రష్యా పాల్పడిందని ఆరోపించారు. ఆర్థిక దుర్వినియోగాలకు పాల్పడుతున్న చైనాను ఎదుర్కొంటామని అన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన, మేధో సంపత్తిపై చైనా దాడులను నిలువరిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:సూకీని విడుదల చేయాలని ప్రపంచ దేశాల ఉద్ఘాటన

ABOUT THE AUTHOR

...view details