తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో కాల్పులు.. 12 మంది మృతి - virginia

అమెరికా వర్జీనియాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 12 మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. వర్జీనియా బీచ్​ ప్రభుత్వ భవనంలో ఈ ఘటన జరిగింది.

వర్జీనియాలో కాల్పులు

By

Published : Jun 1, 2019, 5:23 AM IST

Updated : Jun 1, 2019, 10:02 AM IST

అమెరికాలో కాల్పులు.. 12 మంది మృతి

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. వర్జీనియా బీచ్ మున్సిపల్​ భవనంలో దుండగుడు విచక్షణారహితంగా తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 12 మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. వీరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగిందీ ఘటన. దుండగుడి కాల్పుల్లో ఓ పోలీసు అధికారికీ గాయాలయ్యాయి. అయితే.. బుల్లెట్​ ప్రూఫ్​ జాకెట్​ అతడిని రక్షించింది.

దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు హతమార్చారు. అతడిని ప్రభుత్వ ఉద్యోగిగా అధికారులు గుర్తించారు.

అమెరికాలో చాలా రోజుల తర్వాత జరిగిన కాల్పుల ఘటనపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపిన వర్జీనియా గవర్నర్​... ఇది భయంకరమైన రోజుగా అభివర్ణించారు. మేయర్​.. దీనిని పిరికిపందల చర్యగా పేర్కొన్నారు.

Last Updated : Jun 1, 2019, 10:02 AM IST

ABOUT THE AUTHOR

...view details