చైనాపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో విమర్శనాస్త్రాలు కొనసాగుతున్నాయి. తాజాగా.. భూటాన్లోని భూభాగం తమదేనని పేర్కొనటం, ఇటీవల భారత భూభాగంలోకి చొరబాటు చైనా ఉద్దేశాలను సూచిస్తున్నాయని పేర్కొన్నారు. అధ్యక్షుడు షీ జిన్పింగ్ నేతృత్వంలోని చైనా.. ఇతర దేశాలు అభివృద్ధిలో వెనకబాటుకు గురవుతున్నాయో లేదో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
విదేశీ వ్యవహారాల కమిటీ సమావేశంలో భాగంగా చైనాపై విమర్శలు చేశారు పాంపియో.
" ఈ చర్యలు వారు దశాబ్దాలుగా ప్రపంచానికి సంకేతాలు ఇస్తున్న వాటికి అనుగుణంగా ఉన్నాయని నేను భావిస్తున్నా. చైనా తన అధికారాన్ని విస్తరించుకోవాలనే కోరికతో ఉంది. చైనీయుల లక్షణాలతో ప్రపంచవ్యాప్తంగా సామాజికతను తీసుకువచ్చేందుకు మాట్లాడుతోంది. భూటాన్లో స్థిరాస్తి వాదనలు, భారత్లోకి జరిగిన చొరబాటు చైనా ఉద్దేశాలను సూచిస్తున్నాయి. ఇవి వారి బెదిరింపులకు ప్రపంచం నిలబడుతుందా లేదా అనేది తెలుసుకునేందుకు పరిశీలనలు."