నవంబర్ 8 నుంచి వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న విదేశీ ప్రయాణికులను దేశంలోకి అనుమతించనున్నట్లు అమెరికా శుక్రవారం ప్రకటించింది. దీంతో భారత్, యూకే, చైనా వంటి దేశాలపై ప్రస్తుతం అమలవుతున్న ఆంక్షలు తొలగిపోనున్నాయి.
ఈ కొత్త విధానం అంతర్జాతీయ విమాన, రోడ్డు ప్రయాణాలు.. రెండింటికీ వర్తిస్తుంది. అమెరికా లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆమోదించిన టీకాను తీసుకున్న విదేశీ ప్రయాణికులను దేశంలోకి అమెరికా అనుమతిస్తోంది. కొత్త విధానంపై సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మార్గదర్శకాలు జారీ చేయనుంది.
నవంబరు 8 నుంచి విదేశీయులకు అనుమతి.. కానీ..
కరోనా నేపథ్యంలో విధించిన ప్రయాణ ఆంక్షలను సడలించింది అమెరికా. నవంబర్ 8 నుంచి రెండు డోసులు తీసుకున్న విదేశీ ప్రయాణికులను దేశంలోకి అనుమతించనున్నట్లు తెలిపింది.
వ్యాక్సిన్ వేయించుకున్న వారు మాత్రమే
అమెరికాలో 4,47,83,838 మంది కరోనా బారిన పడగా, 7,21,848 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి:కత్తిదాడిలో ఎంపీ మృతి- అందరూ చూస్తుండగానే..