శత్రువులు ప్రయోగించే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల (ఐసీబీఎం) నుంచి రక్షణ పొందేందుకు అమెరికా మంగళవారం కీలక ప్రయోగాన్ని నిర్వహించింది. ఒక నిరాయుధ క్షిపణిని విజయవంతంగా మార్గమధ్యంలోనే కూల్చేసింది. నిరోధక క్షిపణి (ఇంటర్సెప్టార్ మిసైల్) ఏజీస్ ఎస్ఎం-3తో ఢీ కొట్టించడం ద్వారా ఈ పరీక్షను నిర్వహించింది.
యుద్ధనౌక నుంచి 'క్షిపణి రక్షణ కవచ' పరీక్ష
ఇతర దేశాల నుంచి రక్షణపొందే దిశగా అమెరికా మరో క్షిపణి ప్రయోగం చేపట్టింది. ఇందుకుగానూ ఇంటర్సెప్టార్ మిసైల్‌ను ఏజీస్ ఎస్ఎం-3తో ఢీ కొట్టించింది. ప్రయోగం విజయవంతం అయినట్లు అమెరికా రక్షణ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
యుద్ధనౌక నుంచి 'క్షిపణి రక్షణ కవచ' పరీక్ష
ఈ దఫా తొలిసారిగా ఒక యుద్ధనౌక నుంచి ప్రయోగాన్ని చేపట్టింది. గతంలో నేలమాళిగలో నుంచి ఇంటర్సెప్టార్ క్షిపణులను ప్రయోగించి, పరీక్షించేవారు. తాజా సామర్థ్యం వల్ల తమ క్షిపణి రక్షణ వ్యవస్థ విశ్వసనీయత మరింత పెరుగుతుందని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం 'పెంటగాన్' తెలిపింది. భారీగా ఖండాంతర క్షిపణులను పోగేసుకున్న ఉత్తర కొరియా నుంచి ఎదురయ్యే ముప్పులను దృష్టిలో ఉంచుకొని, ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు భావిస్తున్నారు.