తెలంగాణ

telangana

ETV Bharat / international

వరద బీభత్సం తగ్గక ముందే.. తుపాను గండం - US

అమెరికాలోని నెబ్రాస్కా నగరానికి తుపాను​ ముప్పు పొంచిఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. మిస్సోరీ నదికి దిగువన నివసిస్తున్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అమెరికాకు తుపాను ముప్పు

By

Published : Mar 25, 2019, 7:37 PM IST

అమెరికాకు తుపాను ముప్పు
అమెరికాలోని నెబ్రాస్కా నగరాన్ని కొద్ది రోజుల క్రితమే వరదలు ముంచెత్తాయి. అపార ఆస్తి నష్టం కలిగించి... ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. వరదల వల్ల ముగ్గురు మరణించారు. ఇప్పటికీ ప్రజలు ఇళ్లను శుభ్రపరుచుకునే పనిలోనే ఉన్నారు. మిస్సోరీ నదీ తీరంలో ఉన్న ఈ నగరానికి ఇప్పుడు మరో ఆపద రానుందని అధికారులు ప్రకటించారు.

వారాంతంలో ఈ ప్రాంతానికి తుపాను ముప్పుందని తెలిపారు.​ మిస్సోరీ నదికి దిగువన నివాసముంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

బుధవారం నుంచి శుక్రవారం మధ్యలో వచ్చే తుపాను వల్ల మిస్సోరి నదిలో అడుగుల మేర నీటి ప్రవాహం పెరిగే అవకాశముందని తెలిపారు. ఫలితంగా నది దిగువ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడనుందన్నారు. మొత్తానికి ఎంత మేర నీటి ప్రవాహం పెరుగుతుందో అంచనా వేయలేకపోతున్నామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details