వాణిజ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా-చైనా ముందడుగు వేశాయి. ఏడాదికిపైగా జరిపిన ఉన్నతస్థాయి చర్చల అనంతరం రెండు దేశాల మధ్య మొదటి దశ వాణిజ్య ఒప్పందం కుదిరింది.
వాషింగ్టన్లో జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా ఉప ప్రధాని లియూ హి సంతకాలు చేశారు. అయితే చైనా ఎగుమతులపై సుంకాల తగ్గింపును ఒప్పందంలో చేర్చలేదు.
ఒప్పందంలోని అంశాలు..
మేధో హక్కుల పరిరక్షణ, బలవంతపు సాంకేతిక బదిలీకి ముగింపు, వివాదాల పరిష్కారాలకు సమర్థమైన వ్యవస్థ ఏర్పాటు, కరెన్సీ మార్పులకు ముగింపు తదితర అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ ఒప్పందం ద్వారా చైనాకు అమెరికా రైతుల పంటలు, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులు పెరుగనున్నాయి.