హాంకాంగ్‌లో జరుగుతున్న ప్రజాస్వామ్య అనుకూల నిరసనలకు అమెరికా మద్దతు తెలిపింది. హాంకాంగ్‌లో మానవహక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణకు మద్దతు తెలుపుతూ అమెరికా సెనేట్‌లో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. నిరసనలు అణచివేయడానికి చైనా ప్రయత్నించడాన్ని పరోక్షంగా ఎద్దేవా చేసింది శ్వేతసౌధం.
దీంతోపాటు నిరసనలు అణచివేయడానికి హాంకాంగ్ భద్రతా దళాలు ఉపయోగిస్తున్న భాష్పవాయు గోళాలు, రబ్బర్ బుల్లెట్ల అమ్మకాన్ని కొద్ది నెలల వరకు నిషేధించాలని సెనేట్ తీర్మానించింది. ఈ రెండు బిల్లులను కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం కోసం పంపనున్నారు.
'హాంకాంగ్‌లో పోరాడుతున్నవారికి ఈరోజు అమెరికా సెనెట్ ఓ విషయం స్పష్టం చేస్తోంది. మేము మీతో ఉన్నాం. మీ స్వయం ప్రతిపత్తిని చైనా బలహీనపరుస్తున్నప్పటికీ మేం మీకు ఎల్లప్పుడు అండగా ఉంటాం.'-మార్కో రుబియో, రిపబ్లికన్ సెనేటర్.